
తాజావార్తలు
ఆసక్తికరంగా ‘అర్జున్ సురవరం’ ట్రైలర్
హైదరాబాద్: ‘ఇది మన సమస్య.. మనమే పరిష్కరించుకోవాలి’ అని విద్యార్థులకు పిలుపునిస్తున్నారు యువ కథానాయకుడు నిఖిల్. ఆయన నటించిన చిత్రం ‘అర్జున్ సురవరం’. లావణ్య త్రిపాఠి కథానాయిక. టి.సంతోష్ దర్శకత్వం వహించారు. ఇందులో నిఖిల్.. అర్జున్ అనే పాత్రికేయుడిగా కనిపించనున్నారు. శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. నవంబరు 29న చిత్రం విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందించిన ఈ ప్రచార చిత్రంలో నిఖిల్ నటన ఆకట్టుకుంది.
సాఫీగా సాగిపోతున్న అర్జున్ జీవితంలో ఓ ఉప్పెన వచ్చి పడుతుంది. ‘అర్జున్ను వెంటనే అరెస్టు చేయాలి..’ అని డిమాండ్ చేస్తున్న డైలాగ్ ట్రైలర్లో వినిపించింది. ‘ఒకటి కాదు, రెండు కాదు.. రూ.13 కోట్లు..’ అంటూ పోలీసు అధికారి నిఖిల్‌ను విచారిస్తూ కనిపించారు. ‘ఒక బాధితుడిలా కాదు.. ఒక రిపోర్టర్లా ఆలోచించాలి’ అని పోసాని హీరోలో ధైర్యం నింపడం ఆకట్టుకుంది. ‘ఇది ప్రతి విద్యార్థికి నా సందేశం.. ఇది మన సమస్య, మనమే పరిష్కరించుకోవాలి’ అని నిఖిల్ చివర్లో చెప్పడం కథపై ఆసక్తిని పెంచింది.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
దేవతార్చన
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- సీఎం సర్.. మా నాన్నకు జీతం పెంచండి!
- నలుదిశలా ఐటీ
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- స్కైన్యూస్ నుంచి హెచ్‌సీఎల్ సీఈవోగా..
- బాపట్లలో వింత శిశువు జననం
- ఒక కాలు పోయినా.. పాకిస్థాన్‌పై ఆడతా
- కోహ్లీ అరుదైన రికార్డుకు రోహిత్ పోటీ!