Crime News: అనుమానంతో భార్య గొంతు కోసి హతమార్చిన భర్త

తాజా వార్తలు

Updated : 30/07/2021 01:35 IST

Crime News: అనుమానంతో భార్య గొంతు కోసి హతమార్చిన భర్త

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం అశోక్ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యను గొంతు కోసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. బెల్లంపల్లి పట్టణం అశోక్ నగర్‌కు చెందిన ఆసిఫ్ లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. 18 ఏళ్ల క్రితం అశోక్ నగర్‌కు చెందిన సాహి నీతో వివాహం జరిగింది. ఆసిఫ్ నెల రోజుల నుంచి ఇంటి వద్దే ఉంటున్నాడు. భార్య మరొకరితో సంబంధం కొనసాగిస్తోందనే అనుమానంతో హత్య చేయడానికి ప్రణాళిక రూపొందించాడు.

దీనిలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం తన కుమారుడు సాహెల్‌ను ఏదో పని మీద ఇంటి నుంచి బయటకు పంపించాడు. ఇదే సమయంలో కూతురు తమన్నా స్నానం చేస్తున్న సమయంలో టీవీ శబ్దం పెంచి కత్తితో భార్య గొంతు కోసి హతమార్చాడు. హత్య చేసిన వెంటనే ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. భార్యాభర్తల మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతుండడంతో పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ కూడా జరిగిందని మృతురాలి తల్లి సుల్తానా పోలీసులకు తెలిపారు. భార్యాపిల్లలను బాగా చూసుకుంటానని చెప్పడంతోనే కూతుర్ని పంపించానని సుల్తానా పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని ఏసీపీ రెహ్మాన్, సీఐ రాజు పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని