కల్తీ మద్యానికి 11మంది బలి! 

తాజా వార్తలు

Updated : 13/01/2021 12:57 IST

కల్తీ మద్యానికి 11మంది బలి! 

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని మొరేనాలో విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగి 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఎనిమిది మంది తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ప్రాథమిక సమాచారం ప్రకారం.. పలు గ్రామాలకు చెందిన ప్రజలు తెల్ల రంగులో ఉన్న మద్యాన్ని సేవించారని జిల్లా ఎస్పీ అనురాగ్‌ సుజానియా వెల్లడించారు. వీరిలో మాన్‌పూర్‌, పహవలి గ్రామాలకు చెందిన 11 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. మరో ఎనిమిది మంది తీవ్ర అస్వస్థతకు గురికాగా.. మెరుగైన వైద్యం కోసం గ్వాలియర్‌కు తరలించినట్టు పేర్కొన్నారు. పోస్టుమార్టం కొనసాగుతోందని, శవపరీక్ష వచ్చిన తర్వాత ఈ మద్యం విషపూరితమైందో, కాదో తేలుతుందన్నారు. మరోవైపు, ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా విచారం వ్యక్తంచేశారు. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసు అధికారుల్ని సస్పెండ్‌ చేస్తున్నట్టు చెప్పారు. దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక బృందాన్ని పంపినట్టు ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వదిలి పెట్టేదిలేదని స్పష్టంచేశారు.

ఈ రక్కసికి ఇంకా ఎంతమంది బలికావాలి?: కాంగ్రెస్‌
ఈ ఘటనపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత‌, మాజీ సీఎం కమల్‌నాథ్‌ తీవ్రంగా స్పందించారు. శివరాజ్‌సింగ్ చౌహాన్‌ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఉజ్జయినిలో 16మందిని బలితీసుకున్న తర్వాత కూడా మద్యం  మాఫియా వినాశకర ధోరణలు కొనసాగుతున్నాయన్నారు. తాజాగా ఈ రక్కసి మరో 11మందిని బలితీసుకుందని తెలిపారు. ఈ లిక్కర్‌ మాఫియాకు ఇంకా ఎంతకాలం ప్రజలు ఇలా బలికావాలి? అని ప్రశ్నించారు. అనారోగ్యానికి గురైన వారికి తగిన చికిత్స అందించడంతో పాటు బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. 

ఇదీ చదవండి..

ప్రేమించాడు.. పెళ్లికి నిరాకరించాడుTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని