ఆర్మీ దుస్తుల్లో సంచరిస్తున్న 11మంది అరెస్టు 

తాజా వార్తలు

Published : 18/11/2020 01:04 IST

ఆర్మీ దుస్తుల్లో సంచరిస్తున్న 11మంది అరెస్టు 

గువాహటి : సైనికులని ధ్రువీకరించే ఎలాంటి అధికారిక గుర్తింపు పత్రం లేకుండా సంచరిస్తున్న 11మందిని పోలీసులు అరెస్టు చేశారు. అసోంలోని గువాహటిలో లోకప్రియ గోపీనాథ్‌ బర్దోలీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో సోమవారం రాత్రి పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీసులకు నలుగురు వ్యక్తులు ఆర్మీ దుస్తులు ధరించి అనుమానాస్పదంగా కనిపించారు. ఆరా తీసిన పోలీసు సిబ్బందికు ఆ వ్యక్తులు ఆర్మీకి సంబంధించిన వారు కాదని అర్థమైంది. దీనికితోడు వారు ఇచ్చిన సమాచారంతో మరో ఏడుగురు కూడా ఆర్మీ దుస్తుల్లో తిరుగుతున్నట్లు తెలుసుకొని వాళ్లనూ అదుపులోకి తీసుకున్నారు. 

విచారించగా.. పోలీసుల అదుపులో ఉన్న గోస్వామి అనే వ్యక్తి మిగతా పది మందికి ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ అధికారులుగా అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇచ్చినట్లు తేలింది. వాళ్లతో పాటు గోస్వామి కూడా సెక్యూరిటీ అధికారిగా చలామణి అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అదుపులో ఉన్న 11 మంది ఇళ్లలో తనిఖీలు చేసిన పోలీసులు.. పలు రకాల డాక్యుమెంట్లు, ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై క్రిమినల్ కేసులతో పాటు ప్రభుత్వ స్టాంపుల ఫోర్జరీకి సంబంధించి పలు కేసులను నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. వారి నుంచి పూర్తి వివరాలు రాబెట్టేందుకు విచారణ కొనసాగిస్తున్నారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని