ఆన్‌లైన్‌ పరిచయం.. మైనర్‌పై అత్యాచారం 

తాజా వార్తలు

Published : 16/10/2020 02:17 IST

ఆన్‌లైన్‌ పరిచయం.. మైనర్‌పై అత్యాచారం 

బ్లాక్‌మెయిల్‌ చేసి ముగ్గురు వ్యక్తుల దారుణం

భోపాల్: మైనర్‌ను బ్లాక్‌మెయిల్‌ చేసి ముగ్గురు వ్యక్తులు పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో చోటు చేసుకుంది. 12 ఏళ్ల బాలిక ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడే సమయంలో కొందరు వ్యక్తులు పరిచయమయ్యారు. మైనర్‌తో స్నేహం నటించిన దాదాపు 20 మంది వ్యక్తులు ఆమెతో తరచూ ఆన్‌లైన్‌లో ఛాటింగ్ చేసేవారు. వీళ్లలోని ముగ్గురు వ్యక్తులు గత నెల మాయమాటలు చెప్పి మైనర్‌ను తాము ఉండే ప్రాంతానికి రప్పించుకున్నారు. అనంతరం వాళ్లు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దుశ్చర్యను వీడియో తీశారు. అప్పటి నుంచి ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెడతామని మైనర్‌ను బ్లాక్‌మెయిల్‌ చేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బుధవారం రాత్రి ఆ ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వాళ్లపై పోక్సో చట్టంతో సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఇన్స్‌స్పెక్టర్‌ అలోక్ శ్రీవాస్తవ వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని