Crime news: 8 నెలలుగా గ్యాంగ్‌ రేప్‌.. బిడ్డకు జన్మనిచ్చిన 14ఏళ్ల బాలిక!

తాజా వార్తలు

Published : 28/09/2021 01:40 IST

Crime news: 8 నెలలుగా గ్యాంగ్‌ రేప్‌.. బిడ్డకు జన్మనిచ్చిన 14ఏళ్ల బాలిక!

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో ఓ బాలికపై జరిగిన దారుణకాండ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమీప బంధువు సహా మరో నలుగురు స్నేహితులు ఎనిమిది నెలలుగా బాలిక (14)పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆమె గర్భం దాల్చి శిశువుకు జన్ననిచ్చింది. దిక్కుతోచని స్థితిలో బావిలో విసిరేయగా.. ఆ శిశువు మృతిచెందింది. ఈ ఘటనలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామానికి చెందిన బాలిక తల్లి మూడేళ్ల క్రితమే మృతిచెందింది. ఉపాధి నిమిత్తం తండ్రి ఇతర ప్రాంతాలకు వలస వెళుతుంటాడు. కాగా గ్రామంలోని ఇంట్లో ఆ బాలిక ఒంటరిగానే ఉంటోంది. అయితే తరచూ ఆ ఇంటికి వచ్చే సమీప బంధువు (21) 8 నెలల క్రితం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి మరో నలుగురు స్నేహితులు సైతం బెదిరింపులకు పాల్పడి ఈ దారుణానికి ఒడిగట్టారు. అప్పటి నుంచి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశారు. ఈ క్రమంలో ఆమె గర్భవతి అయినట్లు తెలుసుకున్నారు. గర్భం పోయేందుకు ఆమెకు ట్యాబ్లెట్లు వేశారు. దీంతో ఆమె తీవ్ర గర్భస్రావమై బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డను బాలిక సహా ప్రధాన నిందితుడు ఓ బావిలో విసిరేశారు. శిశువును హత్య చేసినందుకు బాలిక సహా.. అత్యాచానికి పాల్పడ్డ ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్‌ రఘువంశ్‌ భదోరియా వెల్లడించారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు అని తెలిపారు. బాలిక సహా ఇద్దరు మైనర్లను జువైనల్‌ హోమ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని