కొండ చరియలు విరిగిపడి 16 మంది మృతి 

తాజా వార్తలు

Published : 19/10/2020 02:22 IST

కొండ చరియలు విరిగిపడి 16 మంది మృతి 

జమ్మూకశ్మీర్‌ : కొండచరియలు విరిగిపడి 16 మంది మృతిచెందిన ఘటన పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో చోటు చేసుకుంది. రోండూ ప్రాంతం నుంచి రావల్పిండి వెళ్తున్న బస్సుపై కొండచరియలు విరిగి పడటంతో ఈ ఘటన జరిగింది. 18 మంది ప్రయాణికులతో బయల్దేరిన బస్సు మార్గం మధ్యలో ఇద్దరిని వారి గమ్యస్థానాల వద్ద దించింది. మిగతా వారితో ప్రయాణిస్తుండగా గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ మార్గంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. బస్సులో ఉన్నవారందరిపై మట్టి, రాళ్లు పడటంతో 16 మంది మృత్యువాత పడినట్లు రోండూ పోలీసు ఉన్నతాధికారి వివరించారు. ప్రమాదం శనివారం రాత్రి జరగడంతో.. ఆదివారం ఉదయం వరకూ సహాయ చర్యలు చేపట్టలేకపోయారు. అనంతరం శిథిలాల కింద ఉన్న మృతదేహాలను వెలికి తీశారు. మృతిచెందిన వారిలో 10 మంది వివరాలు తెలియరాలేదని పోలీసులు వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని