బెంగాల్‌లో బాంబు పేలుళ్లు.. ఇద్దరి మృతి
close

తాజా వార్తలు

Published : 07/09/2020 11:49 IST

బెంగాల్‌లో బాంబు పేలుళ్లు.. ఇద్దరి మృతి

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో నాటుబాంబు పేలుడు కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. కామర్హటి గోలాఘాట్‌ ప్రాంతంలోని ఓ ఇంటి సమీపంలో నాటు బాంబు పేలింది. సమాచారం అందుకున్న కామర్హటి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన నలుగురిని సాగర్‌ దత్త మెడికల్‌ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని