ఆ మోడల్‌ పేరుతో 20 ఫేక్‌ అకౌంట్లు
close

తాజా వార్తలు

Published : 09/08/2020 00:26 IST

ఆ మోడల్‌ పేరుతో 20 ఫేక్‌ అకౌంట్లు

పోలీసులకు ఫిర్యాదు చేసిన ఐశ్వర్య షెరాన్‌‌

ముంబయి: యూపీఎస్సీ తాజాగా ప్రకటించిన ఫలితాల్లో ర్యాంకు సాధించిన 23 ఏళ్ల మోడల్ ఐశ్వర్య షెరాన్‌ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 20 నకిలీ అకౌంట్లు ఉన్నాయి. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. మిస్‌ ఇండియా ఫైనలిస్ట్‌ అయిన ఐశ్వర్య ముంబయిలోని కొలాబో పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. తన పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో 20 ఫేక్‌ అకౌంట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు అకౌంటే లేదని వెల్లడించారు. ఆర్మీ అధికారి అయిన తండ్రి అజయ్‌కుమార్‌తో కలిసి 2017 నుంచి కొలాబోలోనే ఉంటోంది ఐశ్వర్య. అజయ్‌కుమార్‌కు ఈమధ్యే తెలంగాణలోకి కరీంనగర్‌కు బదిలీ అయ్యింది. ఐశ్వర్య 2019 యూపీఎస్సీ ఫలితాల్లో 93వ ర్యాంకు సాధించారు. ఆమె 2016 ఫెమినా మిస్‌ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌ కావడం విశేషం.

‘ఆగస్టు 5వ తేదీన ఓ న్యూస్‌ పేపర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇన్‌స్టాగ్రామ్‌లో మీ పేరుతో అనేక అకౌంట్లు ఉన్నాయి. వాటిల్లో మీ అధికారిక అకౌంట్‌ ఏది అని ఆ విలేకరి అడిగారు. నాకు ఆ సామాజిక మాద్యమంలో అకౌంట్‌ లేదని తెలిపాను. తర్వాత నా సోదరుడిని ఇన్‌స్టాగ్రామ్‌లో చెక్‌ చేయాల్సిందిగా కోరాను. నా పేరుతో 20 ఖాతాలు ఉండటంతో షాక్‌ గురయ్యాం. అందులో చాలా వరకు అధికారిక అకౌంట్లలాగే ఉన్నాయి. ఒక ఖాతాకి అయితే ఏకంగా 27 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు’ అని ఐశ్వర్య తెలిపింది. ‘ఈ నకిలీ ఖాతాలను నిందితులు దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. డబ్బు కోసం నా సోదరి పేరు, ఫొటోలు వాడుకునే అవకాశం ఉంది. అందుకే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చాం’ అని ఆమె సోదరుడు అమన్‌ షెరాన్‌ పేర్కొన్నాడు. వారిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు కొలాబో పోలీసులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని