close

తాజా వార్తలు

Published : 27/11/2020 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆస్తితగాదాలతో ముగ్గురి సజీవదహనం

అనంతరం నిందితుడి ఆత్మహత్య
ఆస్తి తగాదాలే కారణం

భోపాల్‌: ఆస్తి తగాదాల కారణంగా సవతి సోదరుడి ఇంటికి నిప్పు పెట్టిన ఘటనలో ముగ్గురు సజీవదహనమయ్యారు. అనంతరం నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన గురువారం తెల్లవారుజామున మధ్యప్రదేశ్‌లో జరిగింది. జైథారి పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ త్రిపాఠి తెలిపిన వివరాల ప్రకారం..అనుప్పుర్‌ జిల్లా ధంగవా గ్రామానికి చెందిన ఓంకార్‌ విశ్వకర్మ(46), ఆయన భార్య కస్తూరియా బాయి(42), వారి కుమార్తె నిధి(17), కుమారుడు ఆశిష్‌(18) తో కలిసి బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్నారు.  వారి ఇంటి పక్కనే ఓంకార్‌ సవతి సోదరుడు దీపక్‌ విశ్వకర్మ(32) నివసిస్తున్నాడు. గురువారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ఓంకార్‌ నివసిస్తున్న మట్టి ఇంటిపై దీపక్‌ పెట్రోల్‌ పోసి మంటపెట్టాడు. ఈ ఘటనలో ఓంకార్‌, అతని భార్య, కుమార్తె అక్కడిక్కడే మరణించారు. ఓంకార్‌ కుమారుడు ఆశిష్‌కు తీవ్రగాయాలు కాగా అతణ్ని చికిత్స నిమిత్తం షాడోల్‌కు తరలించారు. ఈ దుశ్చర్య అనంతరం నిందితుడు దీపక్‌ తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు ఆస్తి తగాదాలే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.


Tags :

క్రైమ్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని