PAK: బస్సు - ట్రక్కు ఢీ: 30మంది మృతి

తాజా వార్తలు

Published : 20/07/2021 01:47 IST

PAK: బస్సు - ట్రక్కు ఢీ: 30మంది మృతి

కరాచీ: పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు ట్రక్కు ఢీకొన్న ఘటనలో 30మంది మృతిచెందారు. మరో 40మంది గాయపడ్డారు. పంజాబ్‌ ప్రావిన్స్‌లోని డేరా ఘాజీకాన్‌ జిల్లాలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సియాల్‌కోఠ్‌ నుంచి రాజన్‌పూర్‌కు వెళ్తున్న ఈ బస్సు ఇండస్‌ హైవేపై థౌన్సా బైపాస్‌ వద్ద ట్రక్కును ఢీకొట్టింది. మృతుల్లో ఎక్కువగా  కార్మికులే ఉన్నట్టు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. డ్రైవర్‌ నిద్రమత్తులో బస్సు నడపడంతో ప్రమాదం జరిగినట్టు  ఓ  క్షతగాత్రుడు తెలిపాడు. ఈ ఘటనలో 30మంది మరణించినట్టు  పాకిస్థాన్‌ సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ఫవాద్‌ చౌధురి వెల్లడించారు.  ఈ ప్రమాదంపై పంజాబ్‌ ప్రావిన్స్‌ సీఎం ఉస్మాన్‌ బుజ్దర్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని