ఎమ్మెల్సీ ఇంట్లో కాల్పులు.. ఒకరి మృతి

తాజా వార్తలు

Updated : 21/11/2020 13:24 IST

ఎమ్మెల్సీ ఇంట్లో కాల్పులు.. ఒకరి మృతి

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ఎమ్మెల్సీ నివాసంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన జరిగినప్పుడు ఎమ్మెల్సీ ఇంట్లో ఉన్నారా? లేరా? అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. లఖ్‌నవూలోని ఖరీదైన ప్రాంతంలోని సమాజ్‌వాదీ పార్టీకి చెందిన షాజహాన్‌పుర్‌ ఎమ్మెల్సీ అమిత్‌ యాదవ్‌ ఇంట్లో శనివారం ఉదయం పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఆ వేడుకలకు హాజరైన రాకేశ్‌(35) అనే వ్యక్తి తాను తీసుకొచ్చిన తుపాకీని మరో వ్యక్తికి ఇచ్చాడు. అయితే ఆ వ్యక్తి అనుకోకుండా రాకేశ్‌ ముఖంపై కాల్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. సదరు వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. రాకేశ్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అతడు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో తుపాకీని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని