చైనా బొగ్గు గనిలో ప్రమాదం.. నలుగురు మృతి

తాజా వార్తలు

Published : 05/11/2020 13:10 IST

చైనా బొగ్గు గనిలో ప్రమాదం.. నలుగురు మృతి

బీజింగ్‌ : చైనాలోని షాన్‌జీ ప్రావిన్సులో ఉన్న ఓ బొగ్గుగనిలో విషవాయువు విడుదలైన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. గనిలో పని చేస్తున్న మరో నలుగురు వ్యక్తుల ఆచూకీ కోసం సహాయక చర్యలు చేపట్టారు. ఓ ప్రైవేటు కంపెనీ బొగ్గు గనిలో బుధవారం 42 మంది పని చేస్తుండగా మధ్యాహ్నాం ఒంటి గంట సమయంలో విషవాయువు విడుదలైంది. ఈ ప్రమాదం నుంచి 34 మందిని రక్షించారు. అనంతరం చేపట్టిన సహాయక చర్యల్లో నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. మరో నలుగురు కనిపించకపోవటంతో నిపుణులతో కూడిన బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని