రెండు విమానాలు ఢీ.. ఐదుగురి మృతి
close

తాజా వార్తలు

Published : 11/10/2020 11:15 IST

రెండు విమానాలు ఢీ.. ఐదుగురి మృతి

రెన్నెస్‌: ఓ మైక్రోలైట్‌ విమానం, మరో టూరిస్ట్‌ విమానం ఢీకొన్న ఘటనలో వాటిల్లో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు మృతిచెందారు. ఈ ఘటన పశ్చిమ ఫ్రాన్స్‌లో జరిగింది. ఇద్దరితో ప్రయాణిస్తున్న మైక్రోలైట్‌ విమానం ఓ టూరిస్ట్‌ విహంగాన్ని ఢీట్టింది. దీంతో ఆ రెండు విమానాలు లోచెస్‌లోని ఓ ఇంటి సమీపంలో కూలిపోయాయి. చిన్నపాటి విమానంలోని ఇద్దరు, టూరిస్ట్‌ విహంగంలోని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానిక ప్రభుత్వం వెల్లడించింది. ఘటనకు గల కారణాలు, మృతుల వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించి లోచెస్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని