ఆరుగురి ఆయువు తీసిన విషవాయువు

తాజా వార్తలు

Updated : 13/07/2021 17:23 IST

ఆరుగురి ఆయువు తీసిన విషవాయువు

చంద్రాపూర్‌: మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా దుర్గాపూర్‌లో దారుణం జరిగింది. విద్యుత్ జనరేటర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ వాయువు విడుదలై ఊపిరాడక ఒకే కుటుంబంలోని ఆరుగురు మృత్యువాత పడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. భారీ వర్షాల కారణంగా దుర్గాపూర్ ప్రాంతంలో సోమవారం రాత్రి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో రమేష్ లష్కర్ అనే కాంట్రాక్టర్ తన ఇంట్లోని జనరేటర్‌ను ఆన్ చేసి నిద్రపోయారు. 

తెల్లవారినా ఎవరూ బయటకురాకపోవటంతో పక్కింటి వారు తలుపులు పగలగొట్టి చూడగా.. లష్కర్ కుటుంబంలోని ఆరుగురు విగత జీవులై కనిపించారు. అందులో ముగ్గురు మైనర్లు ఉన్నారు. మరో బాలిక ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే జనరేటర్ నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ ఇల్లంతాదట్టంగా అలుముకుని ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. విషవాయువు వెలువడి ఊపిరాడకపోవడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధరించారు. మృతులను రమేష్‌ లష్కర్‌(25), అజయ్‌ లష్కర్‌(21), మాధురీ లష్కర్‌(20), పూజా(14), లఖన్‌(10), కృష్ణ(8)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని