Accident: కారు ప్రమాదం.. ఒకే ఇంట్లో ఆరుగురి మృతి 
close

తాజా వార్తలు

Published : 26/06/2021 01:25 IST

Accident: కారు ప్రమాదం.. ఒకే ఇంట్లో ఆరుగురి మృతి 

బలరాంపూర్‌: ప్రమాదవశాత్తు ఓ కారు చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి చెందారు. ఈ విషాదం ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలరాంపూర్‌-తులసిపూర్‌ రహదారిపై శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. మృతులు గోండ జిల్లాలోని మన్హానా గ్రామానికి చెందిన కృష్ణ కుమార్‌ సింగ్‌ (38), స్నేహలత (35), శత్రోహన్‌ కుమార్‌ (30), సౌమ్య (18), లిల్లీ (14), ఉత్కర్ష్‌ (12)గా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ఉత్కర్ష్‌ పుట్టిన రోజు సందర్భంగా దేవీ పటాన్‌ ఆలయానికి వెళ్తుండగా లోక్‌హవా గ్రామం వద్ద  ఓ ద్విచక్ర వాహనదారుడిని తప్పించే క్రమంలో కారు చెరువులోకి దూసుకెళ్లడంతో ఈ దుర్ఘటన సంభవించినట్లు వివరించారు. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడికి గాయాలు కావడంతో అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, చెరువులోకి దూసుకెళ్లిన కారు నీటిలో మునిగిపోవడంతో అందులో ఉన్న ఆరుగురిని గ్రామస్థుల సాయంతో బయటకు తీసుకొచ్చినట్టు తెలిపారు. సౌమ్య, లిల్లీ కొన ఊపిరితో బయటపడినప్పటికీ ఆ తర్వాత కాసేపటికే ప్రాణాలు విడిచారు. ఈ ఆరుగురిని జిల్లా మెమోరియల్‌ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు అదనపు ఎస్పీ అరవింద్‌ కుమార్‌ మిశ్రా వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని