యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం..

తాజా వార్తలు

Published : 17/10/2020 10:56 IST

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం..

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సు మరో వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరో 30 మంది గాయపడ్డారు. లఖ్‌నవూ నుంచి పిలిభిత్‌ వెళుతున్న బస్సు పురన్‌పుర్‌ ప్రాంతంలో ఎదురుగా వస్తున్న ఓ పికప్‌ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు బోల్తాపడటంతో అందులోని ఏడుగురు ప్రయాణికులు మృతిచెందారు. పికప్‌ వాహనంతోపాటు బస్సులోని 30 మంది గాయపడినట్లు పిలిభిత్‌ సూపరింటెండెంట్‌ జయప్రకాశ్‌ వెల్లడించారు. క్షతగాత్రులను పలు ఆసుపత్రులకు తరలించినట్లు ఆయన తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని