హోటల్‌లోకి దూసుకెళ్లిన ట్రక్కు: 8 మంది మృతి
close

తాజా వార్తలు

Updated : 29/03/2021 04:14 IST

హోటల్‌లోకి దూసుకెళ్లిన ట్రక్కు: 8 మంది మృతి

బిహార్‌: నలందా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు వేగంగా వచ్చి రోడ్డు పక్కనే ఉన్న హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఘోటల్‌ సిబ్బందితో సహా 8 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన స్థానికులు ట్రక్కుకు నిప్పంటించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు వచ్చిన పోలీసులు, అధికారులపై, వారి వాహనాలపై రాళ్లు విసిరారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ మోహరించారు.

ఈ ఘటనపై బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు వెంటనే సాయం చేయాలని, మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించాలని ఆ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని