డీజీపీ కార్యాలయానికి నరసింహారెడ్డి అటాచ్‌

తాజా వార్తలు

Published : 25/09/2020 00:59 IST

డీజీపీ కార్యాలయానికి నరసింహారెడ్డి అటాచ్‌

హైదరాబాద్‌: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టి ఏసీబీకి చిక్కిన మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డిపై వేటు పడింది. అతడిని డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ డీజీపీ మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నరసింహారెడ్డి స్థానంలో మల్కాజిగిరి ఏసీపీగా మాదాపూర్‌ ఏసీపీ శ్యాంప్రసాదరావును నియమించారు. ఇంటెలిజెన్స్‌లో డీఎస్పీగా పనిచేస్తున్న రఘునందన్‌రావును మాదాపూర్‌ ఏసీపీగా నిమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏసీబీ కేసులో ఇప్పటికే అరెస్టయిన నరసింహారెడ్డిని ప్రభుత్వం సస్పెండ్‌ చేసే అవకాశముంది. 

బుధవారం దాదాపు 25 ప్రాంతాల్లో ఏసీబీ ఏకకాలంలో సోదాలు నిర్వహించి ఏసీపీ నరసింహారెడ్డి అక్రమాస్తులను గుర్తించింది. ఆయన స్వగ్రామమైన అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం పూల ఓబయ్యపల్లితో పాటు తెలంగాణలోని వరంగల్‌, యాదాద్రి భువనగిరి, జనగామ, నల్గొండ, కరీంనగర్‌ జిల్లాల్లోని బంధువులు, స్నేహితులు, బినామీల ఇళ్లల్లో సోదాలు చేసింది.  సుమారు రూ. 7.5 కోట్ల విలువైన అక్రమాస్తుల్ని అధికారులు గుర్తించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ. 70 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని