సంగెం వద్ద బావిలోకి దూసుకెళ్లిన జీపు
close

తాజా వార్తలు

Updated : 27/10/2020 22:18 IST

సంగెం వద్ద బావిలోకి దూసుకెళ్లిన జీపు

సంగెం: వరంగల్‌ గ్రామీణ జిల్లా సంగెం మండలం గవిచర్ల వద్ద జీపు అదుపుతప్పి వ్యవసాయ బావిలో పడింది.  వరంగల్ నుంచి నెక్కొండ వెళ్తుండగా రోడ్డు సరిగా లేకపోవడంతో జీపు అదుపు తప్పినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో 15 మంది జీపులో ఉండగా వారిలో 11 మంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం‌ ఆస్పత్రికి తరలించారు. జీపుతో పాటు మరో నలుగురు బాధితులు బావిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. వారికోసం గాలిస్తున్నారు. సంఘటనా స్థలానికి మామునూరు ఏసీపీ శ్యామ్‌సుందర్‌, పర్వతగిరి సీఐ కిషన్‌ చేరుకున్నారు. డ్రైవర్‌కు ఫిట్స్‌ రావడంతోనే ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. బావిలో పడిన జీపును జేసీబీ సాయంతో బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు బావి నిండుకుండలా కనిపిస్తోంది. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఘటనాస్థలానికి చేరుకున్నారు. 

ఇదీ చదవండి..

సంగెం ఘటన.. జీపు వెలికితీతTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని