డ్రగ్స్‌ కేసులో విచారణకు నటుడి ప్రియురాలు
close

తాజా వార్తలు

Published : 12/11/2020 01:39 IST

డ్రగ్స్‌ కేసులో విచారణకు నటుడి ప్రియురాలు

ముంబయి: మాదకద్రవ్యాల కేసులో బాలీవుడ్‌ విలక్షణ నటుడు అర్జున్‌ రాంపాల్‌ ప్రియురాలు గాబ్రియేల్ల దెమిత్రియాడెస్‌ను నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ)  విచారించింది. బుధవారం మధ్యహ్నం 12 గంటలకు దక్షిణ ముంబయిలోని ఎన్‌సీబీ కార్యాలయానికి చేరుకోగా అధికారులు ఆమెను ప్రశ్నించారు. ఇదే కేసులో అర్జున్‌ రాంపాల్‌ సైతం గురువారం విచారణకు హాజరు కానున్నాడు.

నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ మృతి విచారణలో బాలీవుడ్‌లో డ్రగ్స్‌ వాడకం విషయం బయటపడింది. సుశాంత్‌ సన్నిహితురాలు రియా చక్రవర్తి వాట్సాప్‌ చాట్‌తో అధికారులు పలు కీలక సమాచారం సేకరించారు. సుశాంత్‌కి రియా డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు నిర్ధారించి ఆమెను అరెస్టు చేశారు. రియాతోపాటు ఆమె సోదరుడు సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో బాలీవుడ్‌కి చెందిన పలువురిని అధికారులు ప్రశ్నించారు. గత సోమవారం అర్జున్‌ రాంపాల్‌ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. అనంతరం విచారణకు హాజరుకావాలంటూ రాంపాల్‌తోపాటు గాబ్రియేల్లకు కూడా సమన్లు జారీ చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని