డ్రగ్స్‌ కేసులో విచారణకు అర్జున్‌ రాంపాల్‌
close

తాజా వార్తలు

Updated : 14/11/2020 12:11 IST

డ్రగ్స్‌ కేసులో విచారణకు అర్జున్‌ రాంపాల్‌

ముంబయి: మాదకద్రవ్యాల కేసులో సమన్లు అందుకున్న బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) ఎదుట విచారణకు హాజరయ్యాడు. శుక్రవారం ఉదయమే ముంబయిలోని ఎన్‌సీబీ కార్యాలయానికి చేరుకున్న నటుడిని వారు ప్రశ్నిస్తున్నారు. అర్జున్‌ రాంపాల్ ప్రియురాలు గాబ్రియేల్ల దెమెత్రియాడెస్‌ సోదరుడు అగిసిలావోస్‌ దెమెత్రియాడెస్‌కు మాదకద్రవ్యాల ముఠాతో సంబంధాలున్నట్లు తేల్చిన దర్యాప్తు సంస్థ అతడిని అరెస్టు చేసింది. అర్జున్‌ రాంపాల్‌ ఇంట్లో సోదాలు నిర్వహించింది. సోదాల అనంతరం నటుడితోపాటు అతడి ప్రియురాలు గాబ్రియేల్లకు కూడా సమన్లు జారీ చేసింది. ఈనెల 11వ తేదీన గాబ్రియేల్ల ఎన్‌సీబీ ఎదుట విచారణకు హాజరయ్యింది. కాగా, నేడు రాంపాల్‌ను అధికారులు ప్రశ్నిస్తున్నారు.

నటుడు సుశాంత్‌సింగ్‌ మరణం అనంతరం బాలీవుడ్‌లో మాదకద్రవ్యాల వాడకంపై వివాదం చెలరేగింది. సుశాంత్‌కు అతడి సన్నిహితురాలు, నటి రియా చక్రవర్తి డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు నిర్ధారించుకున్న అధికారులు ఆమెను అరెస్టు చేశారు. రియా వాట్సాప్‌ చాట్‌ ఆధారంగా విచారణ చేపట్టిన అధికారులు బాలీవుడ్‌లోని పలువురిని ప్రశ్నించారు. స్టార్‌ నటీమణులు దీపికా పదుకొణే, శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌, రకుల్‌ప్రీత్‌సింగ్‌తోపాటు పలువురు ఈ జాబితాలో ఉన్నారు. అధికారుల విచారణ కొనసాగుతోంది. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని