
తాజా వార్తలు
మంజీరాలో దూకిన అరుణ మృతదేహం లభ్యం
సంగారెడ్డి: నాలుగు రోజుల క్రితం మనూర్ మండలం రాయిపల్లి బ్రిడ్జిపై నుంచి మంజీరా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన వ్యవసాయ అధికారిణి అరుణ మృతదేహం ఉదయం లభ్యమైంది. నాలుగు రోజుల నుంచి పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చేపట్టగా ఇవాళ ఉదయం ఆరుణ మృతదేహాన్ని మంజీరాలో గుర్తించారు.
ఏం జరిగిందంటే?
నారాయణఖేడ్ మండలం పైడిపల్లికి చెందిన అరుణ(34) సంగారెడ్డిలోని రైతు శిక్షణ కేంద్రంలో ఏవోగా పని చేస్తున్నారు. గతంలో నారాయణఖేడ్, కల్హేర్ తదితర మండలాల్లో వ్యవసాయాధికారిణిగా పనిచేశారు. నాలుగేళ్ల కిందట నాగల్గిద్ద మండలం మోర్గి గ్రామానికి చెందిన శివకుమార్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు రుద్రవీర్(3), విరాట్(11 నెలలు) ఉన్నారు. వీరందరు సంగారెడ్డి పట్టణంలో నివాసముంటున్నారు. గురువారం సంగారెడ్డిలోని రైతు శిక్షణ కేంద్రంలో మధ్యాహ్నం 12 గంటల వరకు విధులు నిర్వహించి ఇంట్లో పని ఉందని కారులో బయల్దేరారు. అక్కడి నుంచి మనూరు మండలం రాయిపల్లి శివారులోని మంజీర నది వద్దకు వచ్చారు. ఆమె తమ్ముడు శివకుమార్‌కు ఫోన్ చేసి మంజీర వంతెనపై నుంచి నదిలో దూకి నేను చనిపోతున్నాని చెప్పి ఫోన్ కట్ చేశారు. తిరిగి శివకుమార్ అక్కకు ఫోన్ చేసినా కలవకపోవడంతో వంతెన వద్దకు వచ్చి గాలించారు. వంతెనపై సమీపంలోనే అరుణ కారు, పర్సు, ఫోన్, చెప్పులు ఉండటంతో మనూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మంజీరలో నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో పోలీసులకు గాలించడం కష్టంగా మారింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సాయంతో మృతదేహాన్ని ఇవాళ గుర్తించారు.
మూడు నెలలుగా మానసిక ఒత్తిడిలో..
మూడు నెలల నుంచి ఏవో అరుణ మానసిక ఒత్తిడిలో ఉందని సంగారెడ్డిలోని వ్యవసాయ కార్యాలయ సిబ్బంది పేర్కొన్నారు. బాధ ఏంటో చెప్పమని పదే పదే అడిగినా సమాధానం ఇచ్చేది కాదని తెలిపారు. వ్యవసాయశాఖ జిల్లా అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చినా మనుసులో మాట తెలుపలేదన్నారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- ప్చ్.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్!
- పాచిపెంట ఎస్సైపై యువకుల దాడి
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- సిరాజ్.. ఇక కుర్రాడు కాదు
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
