
తాజా వార్తలు
బ్రెజిల్లో రోడ్డు ప్రమాదం.. 37మంది మృతి
బొగోటా: బ్రెజిల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 37 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 15 మంది తీవ్ర గాయాపడ్డారు. సాపాలో రాష్ట్ర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ టెక్స్టైల్ కంపెనీ ఉద్యోగులు ప్రయాణిస్తున్న బస్సు, ట్రక్కును ఢీకొని ప్రమాదానికి గురైంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరణించిన వారి దేహాలను బయటకు తీసి గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన నేపథ్యంలో బాధితుల కుటుంబాలకు సంతాపంగా టగ్వా పట్టణంలో మూడు రోజుల సంతాపాన్ని ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలేంటనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా ప్రమాద సమయంలో బస్సులో 53 మంది ఉన్నట్లు తెలుస్తోంది.
Tags :
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- 2-1 కాదు 2-0!
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- ఇక చాలు
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- అందరివాడిని
- సాహో భారత్!
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- కొవిడ్ టీకా అలజడి
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
