మైనర్‌ చెల్లికి డ్రగ్స్‌ ఇచ్చి వ్యభిచారం

తాజా వార్తలు

Published : 22/12/2020 01:50 IST

మైనర్‌ చెల్లికి డ్రగ్స్‌ ఇచ్చి వ్యభిచారం

ఆరుగురి అరెస్టు చేసిన పోలీసులు

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో జరిగిన ఓ ఘటన షాక్‌కు గురిచేస్తోంది. డబ్బుకు ఆశపడిన ఓ అక్క మైనర్‌ అయిన తన చెల్లికి డ్రగ్స్‌ ఇచ్చి వ్యభిచారం చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న తల్లి పోలీసులకు తెలియజేయడంతో అక్కతో సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. భోపాల్‌కు చెందిన 15 ఏళ్ల బాలిక డ్రగ్స్‌కు బానిసవ్వడంతో కౌన్సిలింగ్‌ కోసం తల్లి ఆమెను ఎన్‌జీఓలో చేర్పించింది. అయితే సదరు బాలిక నిర్ఘాంతపోయే విషయాలు వెల్లడించింది. రెండేళ్ల క్రితమే తన సోదరి(20) తనకు మాదకద్రవ్యాలు అలవాటు చేసిందని, డ్రగ్స్‌ ఇచ్చి తనతో వ్యభిచారం చేయించిందని వెల్లడించింది. ఇప్పటివరకు ఐదుగురు వ్యక్తులతో ఆరుసార్లు తనను పంపించిందని పేర్కొంది. దీంతో బాలిక తల్లి గాంధీనగర్‌ పోలీసులను ఆశ్రయించింది.పోక్సో చట్టం కింద అత్యాచారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొదట అక్కను అరెస్టు చేసి విచారించారు. ఆమె అందించిన సమాచారంతో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చదవండి...

ఘరానా నేరస్థుడు.. అత్తారింటికి వచ్చి చిక్కాడు

తండ్రి కళ్లెదుటే ఘోరం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని