హైదరాబాద్‌ మలక్‌పేటలో కారు బీభత్సం
close

తాజా వార్తలు

Updated : 16/12/2020 05:36 IST

హైదరాబాద్‌ మలక్‌పేటలో కారు బీభత్సం

మలక్‌పేట‌(హైదరాబాద్‌): నగరంలోని చాదర్‌ఘాట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మలక్‌పేటలోని డీమార్ట్‌ నుంచి బయటకు వస్తూ రివర్స్‌ తీసుకునే క్రమంలో కారు సమీపంలోని టీ దుకాణంలోకి దూసుకెళ్లింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపురాజు అనే వ్యక్తి మలక్‌పేట డీమార్ట్‌లో సరకులు కొనుగోలు చేసేందుకు తన కారులో వచ్చాడు. షాపింగ్‌ ముగిసిన అనంతరం పార్కింగ్‌ నుంచి రివర్స్‌ తీసుకునే క్రమంలో కారు ఒక్కసారిగా పక్కనే ఉన్న టీ దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న సెక్యూరిటీ ఇంఛార్జ్‌కి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని