పులివెందుల వైకాపాలో భగ్గుమన్న విభేదాలు

తాజా వార్తలు

Updated : 15/11/2020 15:27 IST

పులివెందుల వైకాపాలో భగ్గుమన్న విభేదాలు

పులివెందుల: సీఎం జగన్‌ సొంత నియోజకవర్గం కడప జిల్లా పులివెందులలో వైకాపాలోని వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వేంపల్లి మండలం ఇడుపులపాయలో ప్రజాసంకల్ప యాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా వైకాపా కార్యకర్తలు ఇంటింటికీ పాదయాత్ర చేపట్టారు. అందులో భాగంగా అదే పార్టీకి చెందినవారు రెండు వర్గాలుగా విడిపోయి రాత్రి 10గంటల సమయంలో ఒకరిపై మరొకరు కర్రలతో దాడికి పాల్పడ్డారు. వీరన్నగట్టుపల్లెకు చెందిన పుల్లయ్యవర్గానికి చెందిన నలుగురిని ఇడుపులపాయకు చెందిన చలపతి వర్గం వారు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. పాత కక్షల నేపథ్యంలోనే తమపై దాడి చేశారని పుల్లయ్య వర్గానికి చెందిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో 16 మందిపై కేసు నమోదు చేసినట్లు ఆర్కే వ్యాలీ ఎస్సై కృష్ణమూర్తి తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని