కిడ్నాప్‌ యత్నం.. భార్యాభర్తలకు దేహశుద్ధి

తాజా వార్తలు

Updated : 10/12/2020 06:33 IST

కిడ్నాప్‌ యత్నం.. భార్యాభర్తలకు దేహశుద్ధి

గుంటూరు: మాయమాటలు చెప్పి పిల్లలను అపహరించేందుకు యత్నించిన భార్యాభర్తలకు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన గుంటూరు గుజ్జనగుండ్ల కూడలి వద్ద బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉంటున్న ఓ బాలుడిని భార్యాభర్తలిద్దరు మాయమాటలు చెప్పి బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారెవరో తెలియకపోవడంతో బాలుడు వారితో వెళ్లడానికి నిరాకరించాడు. అంతేకాకుండా అనుమానం వచ్చి కొంత దూరం వారిని వెంబడించాడు. కొంతదూరం వెళ్లాక నిందితులిద్దరూ ధరించిన బుర్ఖాలు తొలగించడాన్ని గమనించిన బాలుడు వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న స్థానికులు, బాలుడి కుటుంబసభ్యులు దంపతులను పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పట్టాభిపురం పోలీసులకు అప్పగించారు. వారి వద్ద ఉన్న సంచిలో ఒక కత్తి, తాడు, గ్లౌజులు, కారం పొడి ప్యాకెట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులిద్దరూ జిల్లాలోని మాచర్ల నుంచి వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని