పంతంగి వద్ద భారీగా గంజాయి స్వాధీనం
close

తాజా వార్తలు

Published : 23/08/2020 02:37 IST

పంతంగి వద్ద భారీగా గంజాయి స్వాధీనం

హైదరాబాద్‌: విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారి పంతంగి టోల్‌ ప్లాజా వద్ద డీఆర్‌ఐ అధికారులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌ తరలిస్తుండగా పంతంగి వద్ద డీఆర్‌ఐ అధికారులు వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ క్రమంలో అందులో పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ సోదాల్లో 3.56 కోట్ల విలువైన 1,427 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్ట్‌ చేశారు. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని