హైదరాబాద్‌ శివారులో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం
close

తాజా వార్తలు

Published : 20/08/2020 01:04 IST

హైదరాబాద్‌ శివారులో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం

హైదరాబాద్‌: నగర శివారులోని ఓ ఫార్మా కంపెనీ ఆవరణలో భారీగా మాదక ద్రవ్యాల(డ్రగ్స్‌)ను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత ఐదు రోజులుగా డీఆర్‌ఐ ప్రత్యేక బృందాలు సదరు కంపెనీతో పాటు ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి. సోదాలు చేసినా కనిపించకుండా ఉండేందుకు వీలుగా మత్తు మందులను భూమిలో పాతిపెట్టినట్లు డీఆర్‌ఐ బృందాలు గుర్తించాయి.  ఇప్పటికే అదుపులోకి తీసుకున్న వారి నుంచి సమాచారం తెలుసుకున్న బృందాలు.. నిన్న రాత్రి పూడ్చిపెట్టిన ప్రదేశాన్ని తవ్వి ఈ మాదక ద్రవ్యాలను అధికారులు వెలికి తీశారు. వెలికితీసిన వాటిలో ఎపిడ్రిన్‌ 45 కిలోలు, మెఫెడ్రోన్‌ 7.5 కిలోలు ఉన్నట్లు డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. వీటి విలువ దాదాపు రూ.6కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు. మాదక ద్రవ్యాల ముఠా కార్యకలాపాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు డీఆర్‌ఐ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని