close

తాజా వార్తలు

ఏమైందో.. ఏమో..!

హోటల్‌ కార్మికుడి ఆత్మహత్య

మూలపాడు (ఇబ్రహీంపట్నం గ్రామీణం), న్యూస్‌టుడే: ఏమి కష్టం వచ్చిందో ఏమో తెలియదు. అతనే మృత్యువును ఆహ్వానించాడు. చివరి నిమిషంలో అమ్మా, నాన్నలు గుర్తుకు వచ్చారు. వారితో ఒక్కసారి మాట్లాడదామనుకొని ఫోన్‌ చేశాడు. అయితే అటు వైపు నుంచి సమాధానం రాలేదు. దీంతో ఇక ఈ లోకానికి సెలవు చెప్పేశాడు. వివరాల్లోకి వెళితే... విశాఖపట్నం సమీపంలోని వేపగుంటకు చెందిన కుమార్‌ (19) వలస వచ్చాడు. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు శివారులోని ఓ హోటల్‌లో కార్మికునిగా పనిచేస్తున్నాడు. రెండు నెలల క్రితం వరకు  ఫెర్రీ హోటల్‌లో పని చేశాడు. ఇటీవల అక్కడి నుంచి మూలపాడు హోటల్‌కు మారాడు. శనివారం హోటల్‌కు సెలవు కావడంతో దానిలో పనిచేసే వారు, యజమాని వారి నివాసాల్లో ఉన్నారు. ఆ యువకుడు మాత్రం హోటల్‌లోనే ఉండేవాడు. అక్కడే ఉరివేసుకొని ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు సంఘటనా స్థలానికి చేరుకొని ఈ విషయాన్ని యువకుని బంధువులకు తెలియజేశారు. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడు ఉరేసుకునే ముందు తల్లిదండ్రులకు ఫోన్‌ చేసినట్లు తెలుస్తోందని.., విచారణలోగాని అసలు విషయాలు తెలియవని పోలీసులు చెప్పారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.