AP news: కర్నూలులో కుటుంబం ఆత్మహత్య
close

తాజా వార్తలు

Updated : 23/06/2021 14:56 IST

AP news: కర్నూలులో కుటుంబం ఆత్మహత్య

కర్నూలు నేరవార్తలు: కర్నూలు నగరంలో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని పాతబస్తీ కడక్‌పుర వీధిలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతాప్, భార్య లత, కుమారుడు జయంత్, కుమార్తె రిషిత ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రతాప్ టీవీ మెకానిక్‌గా జీవనం సాగిస్తున్నాడు. పది రోజుల క్రితం ప్రతాప్ తమ్ముడు ప్రసాద్ భార్య కరోనాతో మృతిచెందింది. దీంతో వారంతా మంగళవారం వరకు తమ్ముడి ఇంటి వద్దనే ఉన్నారు. అదే రోజు రాత్రి తమ ఇంటికి వచ్చారు. ఉదయం ఇంట్లో నుంచి ఎంతకీ బయటకు రాకపోవడంతో మొదటి అంతస్తులో ఉన్న అయన మరో సోదరుడు వెంకటేశ్వర్లు తలుపు తట్టినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చింది. లోపలికి వెళ్లి చూడగా కుటుంబం అంతా విగతజీవుల్లా కనిపించారు. పాలల్లో విషం కలుపుకొని తాగిన ఆనవాళ్లు కనిపించాయి. ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణలో తేల్చారు. అందుకు కారణాలు తెలియాల్సి ఉంది. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కానీ, కుటుంబ సమస్యలు కానీ లేవని మృతుడి సోదరులు తెలిపారు. కర్నూలు డీఎస్పీ మహేష్‌, 1వ పట్టణ సీఐ కళావెంకటరమణ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని