పసి కవలలకు పురుగులమందు తాగించిన తండ్రి

తాజా వార్తలు

Updated : 04/09/2020 14:18 IST

పసి కవలలకు పురుగులమందు తాగించిన తండ్రి

గండేడ్‌: అప్పుడే పుట్టిన కవలలకు తల్లిపాలకు బదులు పురుగుల మందు తాగించాడో తండ్రి.  ఈ ఘటనలో మహబూబ్‌నగర్‌ జిల్లా గండేడు మండలంలోని దేశాయిపల్లి గ్రామంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. దేశాయిపల్లి గ్రామానికి చెందిన కృష్ణవేణి  అనే మహిళను ప్రసవం కోసం ఈనెల ఒకటో తేదీన కోస్గిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అదే రోజు రాత్రి ఆమె ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. మొదటి కాన్పులో ఆడపిల్ల కావడం.. ఇప్పుడు కూడా ఇద్దరు ఆడశిశువులు జన్మించడంతో ఎలాగైనా వారిని వదిలించుకోవాలని  తండ్రి కేశవులు భావించాడు. భార్యకు తెలియకుండా ఇద్దరు శిశువులకు పురుగులమందు తాగించాడు. పిల్లల నోటిలోంచి నురగ రావడం గమనించిన కుటుంబసభ్యులు వైద్యులకు తెలిపారు. వారిపై విషప్రయోగం జరిగిందని వైద్యులు చెప్పడంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. కవలల పరిస్థితి విషమంగా ఉందని జిల్లా వైద్యులు తెలిపారు. దీనిపై కోస్గీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని