సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం

తాజా వార్తలు

Updated : 23/08/2020 08:04 IST

సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం

గుమ్మడిదల: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం  దోమడుగు సమీపంలో రసాయనాలు నిల్వ ఉంచిన గోదాములో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బొంతపల్లి పారిశ్రామిక వాడలో ఉన్న ఈ గోదాములో మొదట మంటలు చెలరేగగా...అందులో ఉన్న రసాయన డ్రమ్ములు పేలి క్షణాల్లో మంటలు విస్తరించాయి. మొత్తం ఏడు అగ్నిమాపక యంత్రాల సాయంతో సిబ్బంది నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చినట్టు అధికారులు తెలిపారు.
 ప్రమాద సమయంలో గోదాములో ఉన్న నలుగురు సిబ్బంది బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నస్టం జరగలేదని  అధికారులు వెల్లడించారు.  అగ్ని ప్రమాదం కారణంగా దట్టమైన పొగలు మూడు కిలోమీటర్ల మేర కమ్మేయగా.. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని