కేసు వాపసు తీసుకోనందుకు ఇంటికి నిప్పు 

తాజా వార్తలు

Published : 23/11/2020 00:44 IST

కేసు వాపసు తీసుకోనందుకు ఇంటికి నిప్పు 

భోపాల్‌:  పోలీసు కేసు వాపసు తీసుకోనందుకు ఇద్దరు దళిత సోదరులపై కొందరు దాడి చేసి, ఇంటికి నిప్పంటించారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని దాటియా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దాటియా జిల్లాకు చెందిన సందీప్‌ దోహరె, సంత్రమ్‌ దోహరె సోదరులకు, పవన్‌ యాదవ్‌కు మధ్య గత రెండు సంవత్సరాలుగా డబ్బు చెల్లింపుల విషయంలో వివాదం చెలరేగింది. ఈ క్రమంలో దోహరె సోదరుల ఫిర్యాదు మేరకు 2018లో పవన్‌ యాదవ్‌పై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దీంతో కేసు వాపసు తీసుకోవాలని పవన్‌ యాదవ్‌ వారిని బెదిరిస్తున్నాడు. ఈ క్రమంలో నిందితుడు, అతని కుటుంబ సభ్యులు సుమారుగా 15 మంది ఇనుప రాడ్లు, గొడ్డళ్లతో సందీప్‌ దోహరె సోదరులపై తీవ్రంగా దాడి చేయడంతో పాటు వారి ఇంటికి నిప్పంటించారు. వెంటనే చుట్టుపక్కల వారు తేరుకొని అక్కడికి రావడంతో నిందితులు పరారయ్యారు. ఈ ఘటనలో నిందితుల మూడు వాహనాలు సైతం కాలిపోయాయి. అనంతరం స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని