ఏపీ అటవీశాఖ అధికారి ఆత్మహత్య
close

తాజా వార్తలు

Updated : 01/10/2020 12:16 IST

ఏపీ అటవీశాఖ అధికారి ఆత్మహత్య

హైదరాబాద్‌: ఏపీ అటవీశాఖ అధికారి వి.బి.రమణమూర్తి (59) హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. నాగోల్‌లోని రాజీవ్‌గృహకల్ప‌ ఐదో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. కుమార్తె నివాసానికి వెళ్లిన రమణమూర్తి రాత్రి 2 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రమణమూర్తి ప్రస్తుతం కోస్టల్‌ మేనేజ్‌మెంట్‌ జోన్‌ ప్రిన్సిపల్‌ కన్జర్వేటివ్‌ అధికారిగా ఉన్నారు. విధినిర్వహణలో ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నారని ఆయన భార్య ఆరోపిస్తున్నారు. రమణమూర్తి మృతిపై ఎల్బీనగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని