అయినవిల్లిలో 13 ఏళ్ల బాలిక కిడ్నాప్‌

తాజా వార్తలు

Updated : 15/12/2020 05:12 IST

అయినవిల్లిలో 13 ఏళ్ల బాలిక కిడ్నాప్‌

అయినవిల్లి: తూర్పుగోదావరి జిల్లాలో ఓ బాలిక కిడ్నాప్‌కు గురైంది. అయినవిల్లి మండలం సానపల్లిలంక పరిధిలోని గుంట్రువారిపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గుంట్రువారిపేటకు చెందిన బాలిక (13)ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. బాలిక తాత 100కు ఫోన్‌  చేయడంతో పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. కుటుంబ కలహాల కారణంగా బాలిక తల్లిదండ్రులు కొన్నాళ్ల క్రితం విడిపోయారు. ఈ నేపథ్యంలో తల్లే కిడ్నాప్‌ చేయించిందని బాలిక తాత ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని