భార్య తలనరికి అనుమానితుడి గుమ్మంలో ఉంచాడు!
close

తాజా వార్తలు

Published : 16/10/2020 02:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భార్య తలనరికి అనుమానితుడి గుమ్మంలో ఉంచాడు!

నారాయణఖేడ్‌లో దారుణం

నారాయణఖేడ్‌: సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నారాయణఖేడ్‌ మండలం అనంతసాగర్‌లో ఓ వ్యక్తి భార్య తల నరికి అతి కిరాతకంగా హతమార్చాడు. సీఐ రవీందర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. అనంతసాగర్‌కు చెందిన జుర్రు సాయిలు, అంశమ్మ (35) భార్యాభర్తలు. అంశమ్మకు గత కొంతకాలంగా ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని సాయిలు అనుమానిస్తున్నాడు. ఈ క్రమంలో ఆమెతో అనేకసార్లు గొడవపడ్డాడు. బుధవారం రాత్రి సైతం భార్యతో గొడవపడి ఆమెపై గొడ్డలితో దాడి చేశాడు. కిరాతకంగా శరీరం నుంచి తలను వేరు చేశాడు. అనంతరం మొండేన్ని ఇంటి సమీపంలో పడేసి తలను నారాయణఖేడ్‌ తీసుకెళ్లి అనుమానిస్తున్న వ్యక్తి ఇంటి గుమ్మం ముందు ఉంచాడు. ఆ తర్వాత నేరుగా నారాయణఖేడ్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. అనంతరం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనాస్థలాన్ని డీఎస్పీ సత్యనారాయణ పరిశీలించారు. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని