బంజారాహిల్స్‌లో భారీగా నగదు స్వాధీనం
close

తాజా వార్తలు

Updated : 15/09/2020 22:17 IST

బంజారాహిల్స్‌లో భారీగా నగదు స్వాధీనం

హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్‌లో భారీగా తరలిస్తున్న నగదును టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హవాలా మార్గంలో డబ్బు తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు నిఘా పెట్టారు. రెండు కార్లలో వెళ్తున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.3.75కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయి కేంద్రంగా నిర్వహించే ఓ సంస్థకు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్ నంబర్‌ 12లో శాఖ ఉంది. ఆ శాఖకు గిరి, రాఠోడ్ అనే వ్యక్తులు బాధ్యులుగా వ్యవహరిస్తున్నారు. ముంబయిలోని అదే కంపెనీ ప్రధాన శాఖలో పని చేసే దిలీప్, హరీష్ హైదరాబాద్‌ వచ్చారు. ఈ నలుగురూ కారులో డబ్బును తరలిస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు ఆ వాహనాన్ని ఆపారు. కారులో తనిఖీ చేయగా నగదు బయటపడింది. నగదుకు సంబంధించి లెక్కలు చూపించకపోవడంతో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగిస్తామని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. విచారణలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముందన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని