close
Array ( ) 1

తాజా వార్తలు

మంటల్లో చిక్కుకున్న భార్యను రక్షించేయత్నంలో...

దుబాయ్‌లో ప్రాణాలు కోల్పోయిన కేరళవాసి

దుబాయ్‌: మంటల్లో చిక్కుకున్న తన భార్యను రక్షించబోయి మృత్యుఒడికి చేరిన ఘటన అబుదాబీలో జరిగింది. కేరళకు చెందిన అనిల్‌ నైనన్‌(32)తన భార్య నీనూ, కుమారుడు(4)తో కలిసి అబుదాబీలో ఉంటున్నారు. అయితే గత వారం, రాత్రి సమయంలో వీరు ఉంటున్న అపార్టుమెంట్‌ కారిడార్‌లో మంటలు చెలరేగాయి. కారిడార్‌లో ఉన్న భార్య మంటల్లో చిక్కుకున్నట్లు గమనించిన అనిల్‌ తన భార్యను రక్షించడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో అతనికి కూడా మంటలు అంటుకోవడంతో ఇద్దరినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్సకోసం అబుదాబీలోని మరో ఆసుత్రికి తరలించి అత్యవసరచికిత్స అందించారు. 90శాతం గాయాలైన అనిల్‌ వారంపాటు మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు కోల్పోయినట్లు సోమవారం వైద్యులు ప్రకటించారు. అయితే భార్యకు పదిశాతం మాత్రమే కాలిన గాయాలు అయ్యాయని..ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నామని అనిల్‌ బంధువులు స్థానిక మీడియాకు తెలిపారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
Saket Pranamam
VITEEE 2020
dr madhu
HITS2020
besttaxfiler

Panch Pataka

దేవతార్చన