యువతిపై దాడి ఘటనలో ముమ్మర దర్యాప్తు 

తాజా వార్తలు

Updated : 02/12/2020 19:50 IST

యువతిపై దాడి ఘటనలో ముమ్మర దర్యాప్తు 

విశాఖపట్నం: యువతిపై కత్తి దాడికి సంబంధించి విశాఖ పోలీసులు రంగంలోకి దిగారు. థాంసన్‌ స్ట్రీట్‌లోని ఓ ఇంట్లో యువతిపై జరిగిన కత్తి దాడికి సంబంధించి దిశా ఏసీపీ ప్రేమ్‌ కాజల్‌ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు తెలుసుకుంటున్నారు. క్లూస్‌టీంతో పాటు రంగంలోకి దిగిన పోలీసులు పలు ఆధారాలు సేకరిస్తున్నారు. యువతిపై దాడికి పాల్పడిన శ్రీకాంత్‌ యువతి పక్కింట్లోనే ఉంటాడని ఏసీపీ తెలిపారు. హత్యాయత్నం, ఆత్మహత్యాయత్నం కేసులతోపాటు అక్రమంగా ఇంట్లోకి చొరబడినందుకుగాను నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు.

విశాఖలో బుధవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. థాంసన్‌ స్ట్రీట్‌కు చెందిన శ్రీకాంత్ అనే యువకుడు యువతిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. దాడిలో యువతి మెడకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం నిందితుడు కూడా కత్తితో మెడపై గాయపర్చుకున్నాడు. ప్రస్తుతం ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రేమ పేరుతో వేధించడంతో పాటు పెళ్లికి అంగీకరించడంలేదని కక్ష పెంచుకొని శ్రీకాంత్‌ దాడికి పాల్పడినట్లు బాధితురాలి కుటుంబసభ్యులు పేర్కొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని