కీసర కేసు: నిందితులు నోరు విప్పట్లేదు!

తాజా వార్తలు

Published : 28/08/2020 01:05 IST

కీసర కేసు: నిందితులు నోరు విప్పట్లేదు!

హైదరాబాద్‌: కీసర తహసీల్దార్‌ లంచం కేసులో అనిశా అధికారుల విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా మూడు రోజుల పాటు నిందితులను అనిశా కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు చివరి రోజు కావడంతో నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు అనిశా అధికారులు ప్రయత్నిస్తున్నారు. రెండు రోజుల విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు నిందితులు సమాధానాలు ఇవ్వకుండా మౌనం వహించినట్లు సమాచారం. కేసుకు సంబంధించి ఇతర అధికారుల పాత్ర, తహసీల్దార్‌ ఇంట్లో దొరికిన లాకర్‌ తాళం.. స్థిరాస్తి వ్యాపారులకు ఆ డబ్బు ఎలా వచ్చింది? తదితర ప్రశ్నలకు నిందితుల నుంచి ఎలాంటి సమాధానం రానట్టు తెలుస్తోంది. దీంతో వారి నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు అనిశా అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరి కాసేపట్లో నిందితుల కస్టడీ సమయం ముగియనుండగా.. ఆ లోపు వాళ్ల నుంచి కావలసిన సమాధానాలు రాబట్టేందుకు అనిశా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.    
కోట్ల రూపాయల విలువైన భూమిని నిబంధనలకు విరుద్ధంగా స్థిరాస్తి వ్యాపారుల పేరు మీద మార్చడానికి తహసీల్దార్‌ నాగరాజు రూ.రెండు కోట్లు లంచం డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో స్థిరాస్తి వ్యాపారులు అంజిరెడ్డి, శ్రీనాథ్‌ కలిసి నాగరాజుకు రూ.1.10కోట్ల లంచం ఇస్తుండగా పక్కా సమాచారంతో అనిశా అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని