
తాజా వార్తలు
రూ.2 వేలు ఇవ్వలేదని బావనే హతమార్చాడు
పెద్దారవీడు: ఓ నిండు ప్రాణం రూ. 2 వేలకు బలిఅయ్యింది. తీసుకున్న అప్పును తిరిగి చెల్లించలేదని సొంత బావనే బావమరిది కడతేర్చాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం చెంచుగిరిజన కాలనీలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు.. గిరిజన కాలనీకి చెందిన మండ్ల రాజయ్య(30), కుడుముల చెన్నయ్య వరుసకు బావ, బావమరిదిలు. రాజయ్య తన బావమరిది చెన్నయ్య వద్ద రూ.2 వేల నగదు అప్పుగా తీసుకున్నాడు. తిరిగి చెల్లించకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహించిన చెన్నయ్య తన వద్ద ఉన్న బాణం వేయడంతో.. రాజయ్య శరీరంలో బలంగా దిగి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలాన్ని ఎస్సై రామకృష్ణ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Tags :
క్రైమ్
జిల్లా వార్తలు