జగ్గయ్యపేట వద్ద కారులో భారీగా మద్యం 
close

తాజా వార్తలు

Updated : 30/09/2020 17:42 IST

జగ్గయ్యపేట వద్ద కారులో భారీగా మద్యం 

కారుపై దుర్గగుడి పాలకమండలి సభ్యురాలి పేరుతో బోర్డు

జగ్గయ్యపేట: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సీతారాంపురంలోని ఓ అపార్టుమెంట్‌లో నిలిపి ఉంచిన కారులో భారీగా మద్యం సీసాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మద్యం సీసాలు లభ్యమైన కారుపై విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయ పాలకమండలి సభ్యురాలి బోర్డు ఉండటం కలకలం రేపుతోంది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. మద్యం సీసాలు కారులోకి ఎలా వచ్చాయి? ఎవరు తీసుకొచ్చారు? అనే కోణంలో ఎస్‌ఈబీ, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి వివరాలూ వెల్లడించలేదు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని