చిన్నచింతకుంటలో ప్రేమికుల ఆత్మహత్య

తాజా వార్తలు

Updated : 19/12/2020 06:28 IST

చిన్నచింతకుంటలో ప్రేమికుల ఆత్మహత్య

చిన్నచింతకుంట: పెద్దలు ప్రేమకు అంగీకరించలేదని ఓ ప్రేమజంట శీతల పానీయంలో విషం కలుపుకొని తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం ఉంద్యాల సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నారాయణపేట జిల్లా నర్వా మండలం లంకాల గ్రామానికి చెందిన శేఖర్ (23), అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక ఏడాదిగా  ప్రేమించుకుంటున్నారు. 

బాలిక మైనర్‌ కావడం.. ప్రేమికుల కులాలు కూడా వేర్వేరనే కారణంతో పెద్దలు వీరి ప్రేమను అంగీకరించలేదు. దీంతో వీరిద్దరూ ఈ నెల 15న రాత్రి ద్విచక్రవాహనంపై ఇంటి నుంచి వెళ్లిపోయారు. శుక్రవారం ఉంద్యాలలో స్థానికులు వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్తున్న సమయంలో వీరిద్దరూ విగత జీవులుగా కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చిన్న చింతకుంట ఎస్సై సంతోష్‌ తెలిపారు. 

ఇదీ చదవండి..

గాజువాకలో ప్రేమజంట ఆత్మహత్య


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని