close

తాజా వార్తలు

Published : 29/11/2020 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆర్మూర్‌లో ప్రేమజంట ఆత్మహత్య

ఆర్మూర్‌ పట్టణం: నిజామాబాద్‌ జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఆర్మూర్‌ పట్టణ పరిధి పెర్కిట్‌ శివారులోని ఓ మామిడి తోటలో వారు బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్‌ పట్టణంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన యువతి, కమ్మర్‌పల్లి మండలం ఉకునూర్‌కు చెందిన యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం పెర్కిట్‌ శివారులోని ఓ మామిడి తోటలో వీరిద్దరూ విగతజీవులుగా కన్పించారు. గమనించిన తోట యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. యువతి మేజర్‌ కాగా.. యువకుడు మైనర్. దీంతో వీరి ప్రేమకు తల్లిదండ్రులు అంగీకరించరేమోనన్న భయంతోనే వీరు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Tags :

క్రైమ్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని