close

తాజా వార్తలు

Published : 26/10/2020 00:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బిహార్‌లో ఎమ్మెల్యే అభ్యర్థి హత్య

పట్నా: బిహార్‌ శాసనసభ ఎన్నికల్లో హింసాత్మక ఘటన చోటు చేసుకుంది. జనతా దళ్‌ రాష్ట్రావధి (జేడీఆర్‌) పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ్‌ సింగ్‌ (45)ను దుండగులు హత్య చేశారు. పార్టీ కార్యకర్తలతో కలిసి షియోహర్‌ జిల్లాలోని హత్‌సార్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. కొందరు వ్యక్తులు అక్కడికి వచ్చి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో నారాయణ్‌సింగ్‌ ఛాతిలోకి బుల్లెట్‌ దూసుకుపోయింది. దీంతో ఆయన అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో కార్యకర్తకు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమద్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు.

దుండగులు నారాయణ్‌సింగ్‌ మద్దతుదారుల్లో కలిసిపోయి హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దీని వెనక మరో ఆరుగురి హస్తమున్నట్లు భావిస్తున్నారు. అయితే నారాయణ్‌ సింగ్‌కు నేర చరిత్ర ఉంది. దాదాపు 36 కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు. అయితే పాత కక్షలతోనే హత్య చేశారా? దీని వెనక రాజకీయ కారణాలేమైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

షియోహర్‌ శాసనసభ స్థానానికి మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీలైన ఆర్జేడీ, జేడీయూ,ఎల్‌జేపీ కూడా ఈ  స్థానానికి అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు జేడీయూ మిత్రపక్షం భాజపా కూడా ఇక్కడ తమ అభ్యర్థిని నిలబెట్టడం గమనార్హం. తాజా ఘటనతో నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేశారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.