పెళ్లికి నిరాకరించిందని నటిపై కత్తితో దాడి
close

తాజా వార్తలు

Published : 28/10/2020 01:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెళ్లికి నిరాకరించిందని నటిపై కత్తితో దాడి

ఫేస్‌బుక్‌ పరిచయం..

ముంబయి: తనతో వివాహానికి నిరాకరించిందని బుల్లితెర నటి మాల్వీ మల్హోత్రాపై ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఫేస్‌బుక్‌ ద్వారా ఆమెకు పరిచయమైన అతడు నటిపై కత్తితో దాడి చేశాడు. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ముంబయి వెర్సోవా ప్రాంతంలోని ఓ కేఫ్‌ నుంచి నటి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కుమార్‌ మహిపాల్‌ సింగ్‌ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అతడు చిత్ర పరిశ్రమలో నిర్మాత అని తెలిసింది.

‘కారులో వెళ్తున్న సింగ్‌ కేఫ్‌ సమీపంలో ఉన్న నటిని అడ్డగించాడు. తనను ఎందుకు దూరం పెట్టావని, ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం సింగ్‌ నటి పొట్ట భాగంలో, చేతులపై కత్తితో దాడి చేసి, పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఐపీసీ సెక్షన్‌ 307 (హత్యాయత్నం)తోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టాం’ అని వెర్సోవా పోలీసు స్టేషన్‌కు చెందిన సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ రాఘవేంద్ర ఠాకూర్‌ తెలిపారు.

ఫేస్‌బుక్‌ ద్వారా సింగ్‌ పరిచయం అయ్యాడని, ఏడాదిగా అతను తెలుసని నటి పోలీసులకు చెప్పారు. అతడు తనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని, కానీ దానికి తిరస్కరించానని పేర్కొన్నారు. మాల్వీ ‘ఉడాన్‌’, ‘హోటెల్‌ మిలాన్‌’ టీవీ షోలతో మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం కోకిలబెన్‌ అంబానీ ఆసుపత్రితో ఆమెకు చికిత్స జరుగుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని