తబ్లీగీ సభ్యుల సమాచారం చెప్పారని దాడి
close

తాజా వార్తలు

Published : 02/04/2020 13:44 IST

తబ్లీగీ సభ్యుల సమాచారం చెప్పారని దాడి

ముంబయి: తబ్లీగీ జమాత్‌కు హాజరైన వారి వివరాలను బయటపెట్టాడన్న నెపంతో ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటన మహారాష్ట్రలోని సోలాపూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. దిల్లీలో నిర్వహించిన తబ్లీగీ జమాత్‌ మర్కజ్‌లో వేల మంది పాల్గొన్న సంగతి తెలిసిందే. దీనికి ఇండోనేసియా, మలేసియా, బంగ్లాదేశ్‌ తదితర దేశాల నుంచి కొందరు పాల్గొనడంతో వారి ద్వారా కరోనా వైరస్‌ సోకింది. ప్రస్తుతం దేశంలో నమోదైన కేసుల్లో ఎక్కువ భాగం ఇక్కడ నుంచే వస్తున్నాయి. వీరి ఆచూకీ కనుకొనేందుకు పోలీసులు, ప్రభుత్వాలు ఎంతో శ్రమిస్తున్నాయి.

తబ్లీగీ జమాత్‌కు హాజరైన వారి వివరాలను కొందరు స్థానికులు అధికారులకు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎందుకు చెబుతున్నారంటూ వారిపై దాడి చేస్తున్నారు. సోలాపూర్‌ జిల్లాలోని వైరాగ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనూ ఇలాగే జరిగింది. దాదాపు ఏడుగురు వ్యక్తులు తబ్లీగీకి హాజరయ్యారని ఓ వ్యక్తి స్థానిక గ్రామసేవక్‌కు సమాచారం అందించారు. వారికి కరోనా పరీక్షలు చేయించాలని సూచించారు. ఈ విషయం తెలుసుకున్న సంబంధీకులు ఎందుకు సమాచారం బయటకు చెప్పావని అతడిపై దాడి చేశారని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని