మాజీ ప్రియురాలు దూరం పెడుతోందని..!

తాజా వార్తలు

Published : 24/09/2020 00:56 IST

మాజీ ప్రియురాలు దూరం పెడుతోందని..!

దిల్లీ: మాజీ ప్రియురాలు పట్టించుకోవడం లేదని ఓ యువకుడు ఆమె ఇంటి ముందు కాల్పులకు తెగబడ్డాడు. దిల్లీలోని ధరంపాల్‌ కాలనీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ యువకుడిని బుధవారం అరెస్టు చేసి కటకటాల్లోకి పంపారు. డీసీపీ ఆర్‌పీ మీనా తెలిపిన వివరాల ప్రకారం.. సుమిత్‌ తోమర్‌ అనే వ్యక్తి గతంలో ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. కొద్ది కాలం తర్వాత అతడు మరో అమ్మాయిని వివాహం చేసుకోవడంతో మాజీ ప్రియురాలు సుమిత్‌ను దూరం పెట్టింది. అతడితో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించేందుకు నిరాకరించింది. దీంతో గత కొన్నాళ్లుగా పగ పెంచుకున్న సుమిత్‌ ఇటీవల ఆమె ఇంటికి వెళ్లాడు. ఇంటి ముందు నిలబడి కేకలు వేస్తూ తన ప్రియురాలిని, ఆమె కుటుంబసభ్యులను చంపేస్తానని బెదిరిస్తూ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో భయాందోళనకు గురైన బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి కోసం ఆలి విహార్ అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టిన పోలీసులు చివరకు అతడిని అరెస్టు చేశారు. అతడి వద్ద తుపాకీని స్వాధీనం చేసుకుని.. విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని